road show

BJP campaign : నేడే చివరి తేదీ.. ప్రచారంలో జోర్ పెంచిన.. బీజేపీ

BJP campaign : నేడే చివరి తేదీ.. ప్రచారంలో జోర్ పెంచిన.. బీజేపీ

బీజేపీతో పొత్తు పెట్టుకున్న జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ హైదరాబాద్లో రోడ్ షో నిర్వహించనున్నారు. కూకట్ పల్లిలో జనసేన అభ్యర్థి తరపున ఆయన రోడ్ షో నిర్వహించనున్నారు.
బాలానగర్ కూడలి నుంచి పవన్ రోడ్ షో ప్రారంభం కానుంది. కొత్త బోయినపల్లి క్రాస్ రోడ్డు, బోయినపల్లి పీఎస్, పాత బోయినపల్లి చెక్ పోస్ట్, హస్మత్ పేట్ బస్టాప్, అంబేద్కర్ విగ్రహం వరకు రోడ్ షో నిర్వహించనున్నారు. పవన్ రోడ్ షోకు పార్టీ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలను ప్రశాంతంగా, స్వేచ్ఛగా నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు.