Sujith – Nani : “ఓజీ” ని పక్కన పెట్టి నానితో.. సుజీత్ ప్రయాణం
ఇప్పటి దాకా తన దర్శకత్వంలో వచ్చింది రెండే సినిమాలే అయినప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ డైరెక్టర్ సుజీత్. 2014లో వచ్చిన ‘రన్ రాజా రన్’ (Run Raja Run) తో దర్శకుడిగా పరిచయమైన సుజీత్. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత ఏకంగా పాన్ ఇండియా (Pan India) స్టార్ ప్రభాస్ తో ‘సాహో’ (Saaho) సినిమా చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు.