JAGAN MAYA MAHAL : విదేశాల నుంచి లగ్జరీ ఐటెమ్స్.. సీఎం బెడ్రూమ్ కే కోట్లల్లో ఖర్చు
రుషికొండ ప్యాలెస్ (Rushikonda Palace)లో మంచాలు, కుర్చీలు, పరుపులు, బల్లలు.. ఇలా ఏవి చూసినా… అబ్బో యమ కాస్ట్ లీ… ఆ డిజైన్లు… ఆ హంగులూ… చూస్తే దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. అప్పట్లో రాజులు… ఆ తర్వాత సద్దాం హస్సేన్, అమెరికా అధ్యక్ష భవనం లాంటి చోట్ల ఉండే ఖరీదైన వస్తువులు రుషికొండ ప్యాలెస్ లో కనిపిస్తున్నాయి. మొత్తం ఫారెన్ ఇంపోర్టెడ్ సరుకే… ఎక్కడా కూడా ఇండియా మేడ్ వస్తువు లేదంటే… దాని యవ్వారం ఏ రేంజ్ లో ఉందో అర్థమవుతోంది.