Salar : ప్రభాస్ ఫ్యాన్స్ కొత్త రింగ్ టోన్
తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసిన ప్రభాస్ ‘సలార్’ సినిమా గురించే చర్చ నడుస్తోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన చిత్రం ‘సలార్’. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసిన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్తో దూసుకుపోతుంది. ఈ సినిమాలోని పాటలు తక్కువే అయినా, బీజీఎం ప్రధాన బలంగా పనిచేసింది. ఈ సినిమాకు ప్రధాన బలమైన బీజీఎంను తాజాగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.