Telangana Liquor: మద్యం అమ్మకాల్లో దేశంలోనే తెలంగాణ టాప్ బీర్లను నీళ్లలా తాగేస్తున్న మందుబాబులు..
మద్యం అమ్మకాల్లో తెలంగాణ దూసుకుపోతోంది. ఏడాదికేడాది మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం పెరుగుతోంది. ఏటా రికార్డులు బ్రేక్ అవుతున్నాయ్. వేసవికాలంలో మరో రికార్డు నమోదైంది. తెలంగాణలో మద్యం కిక్కు అసలు తగ్గడం లేదు. ప్రతీ ఏడాది కిక్కు మరింతగా పెరుగుతూనే ఉంది. నానాటికి మద్యం అమ్మకాలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి.