KTR OVERACTION : కేటీఆర్.. ఇప్పుడు గుర్తుచ్చారా? సర్పంచ్ ల గోస ఏనాడూ పట్టించుకోలే !
తెలంగాణలో అధికారంలో ఉన్న 10యేళ్ళల్లో ఏనాడూ గ్రామపంచాయతీ (Gram Panchayat) సర్పంచ్ (Sarpanch) ల గోసను పట్టించుకోలేదు అప్పటి కేసీఆర్ ప్రభుత్వం (KCR Government). కానీ ఇప్పుడు దిగిపోయాక.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సడన్ గా సర్పంచ్ ల మీద ప్రేమ పుట్టుకొచ్చింది. వాళ్ళ బిల్లుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వంతో కొట్లాడుతా అంటూ స్టేట్ మెంట్స్ ఇస్తున్నారు.