YS Sharmila: సికింద్రాబాద్ ఎంపీగా షర్మిల పోటీ చేయబోతున్నారా..? ప్రచారంలో నిజమెంత..?
వైటీపీని కాంగ్రెస్లో విలీనం చేసేందుకు షర్మిల సిద్ధం అవుతున్నారన్న ప్రచారం తెలంగాణ రాజకీయవర్గాల్లో జోరుగా సాగుతోంది. కాంగ్రెస్ పెద్దలతో షర్మిల వరుసగా రాయబారాలు నడుపుతున్నారు. మొన్న డీకేను, నిన్న కేవీపీని.. ఇవాళ జానారెడ్డిని కూడా కలుసుకున్నారని, కాంగ్రెస్లోకి వచ్చేందుకు సిద్ధం అని సంకేతాలు పంపారనే డిస్కషన్ నడుస్తోంది.