Bangladesh Election : బంగ్లాదేశ్ లో మొదలైన పోలింగ్.. ఢాకాలో ఓటు చేసిన షేక్ హసీనా.. భారత్కు ప్రధాని ధన్యవాదాలు
పొరుగు దేశం బంగ్లాదేశ్ నేడు జరిగే సాధారణ 12వ సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమైంది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఎన్పీ ఎన్నికలను బహిష్కరించాలంటూ 48 గంటల దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా భద్రతా ఏర్పాట్లను ముమ్మరం చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న 300 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిపేందుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. 436 మంది స్వతంత్రులు సహా 27 రాజకీయ పార్టీలకు చెందిన 1,500 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు