Somesh Kumar lands : ఫార్మాసిటీ పక్కన ఎకరం రెండున్నర లక్షలే… ! సోమేశ్ మెడకు భూముల ఉచ్చు !!
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అనుచరుడు, మాజీ CS సోమేశ్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. తెలంగాణ పాలన వ్యవహారాలను సింగిల్ హ్యాండ్ తో శాసించిన ఈ బిహారీ అధికారి భారీ అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. పాతిక ఎకరాల భూముల కొనుగోలు వ్యవహారం ఆయన మెడకు చుట్టుకుంటోంది. HMDA అవినీతి తిమింగలం శివ బాలకృష్ణతో లింక్ సోమేశ్ కుమార్ బాగోతాన్ని బయట పెట్టాయి.