Shobha

Bigg Boss : బిగ్ ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్..

Bigg Boss : బిగ్ ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్..

శ‌నివారం నాటి ఎపిసోడ్‌తో హీటెక్కిపోయిన బిగ్ బాస్ హౌస్‌లో.. సండే మాత్రం ఫ‌న్‌డే గా గ‌డిచింది.. శనివారం కంటెస్టంట్ల‌పై ఫుల్ ఫైర్ అయిన హోస్ట్ నాగార్జున‌.. ఆదివారం మాత్రం కూల్‌గా ఎంట‌ర్‌టైన్ చేశారు.. మ‌రో వైపు ఇంకా ఒక్కవారమే ఉండటంతో ఎవరు ఫైనలిస్ట్ అవుతారు అన్నదాని పై టెన్షన్ నెలకొంది.. నిన్నటి ఎపిసోడ్ లో నాగార్జున ఫైనలిస్ట్ ఎవరు అన్న‌ది కన్ఫామ్ చేసేశారు. ఆడుతూ పాడుతూ జరిగిన ఈ ఎపిసోడ్ లో నాగార్జున వరుసగా ఫైనలిస్ట్ లను అనౌన్స్ చేశారు. వచ్చి రాగానే సెకండ్ ఫైనలిస్ట్ అంటూ ప్రియాంకను అనౌన్స్ చేశారు నాగార్జున దాంతో అమ్మడు ఆనందానికి హ‌ద్దే లేకుండా పోయింది..