Sikkim floods : సిక్కింను ముంచెత్తిన మెరుపు వేగపు వరదలు.. 14 మృతి, 102 మంది గల్లంతు.
సిక్కింను ముంచెత్తిన బీకర వరదలు. ఆకస్మిక వరదలతో భారీగా ప్రాణ, ఆస్తీనష్టం. మంగళవారం రాత్రి నుంచి కుండపోత వర్షం కురుస్తుండడంతో లాచెన్ లోయలోని తీస్తా నది నీటిమట్టం ఒక్కసారిగా పెరిగింది. దీంతో చుంగ్తాంగ్‌లోని 1200 మెగావాట్ల డ్యామ్ పూర్తిగా కొట్టుకుపోయింది. అర్ధరాత్రి 1.30 గంటల ప్రాంతంలో మెరుపు వరదలు సంభవించాయి. ఆకస్మిక వరదల వల్ల నది తీరాన ఉన్న ఆర్మీ క్యాంప్ జవాన్లు సైతం కొట్టుకుపోయారు.