KTR – Harish: ఇంతలోనే ఎంత మార్పు..? కేటీఆర్ కమ్మ భజన..! హరీష్ బాబు భజన..!!
ఎన్నికల్లో ఎన్ని కళలో… ఒక్క ఓటుకై ఎన్ని వలలో అని వెనకటికి ఓ కవి రాసినట్లుగా టిఆర్ఎస్ నాయకులు తమకు అలవాటైన విద్యనే మళ్లీ మళ్లీ ప్రదర్శిస్తూ ఉంటారు. అవసరం వచ్చినప్పుడు ఎవరినైనా కావలించుకుని ముద్దాడే కెసిఆర్ వారసులు ఇప్పుడు మళ్లీ అదే స్టైల్ మొదలుపెట్టారు.