South Korea

North Korea: మాంత్రికుడి ప్రాణం చిలుకలో అన్నట్లు.. ఉత్తర కొరియా రాకెట్ రహస్యం.. దక్షిణ కొరియా చేతుల్లో..

North Korea: మాంత్రికుడి ప్రాణం చిలుకలో అన్నట్లు.. ఉత్తర కొరియా రాకెట్ రహస్యం.. దక్షిణ కొరియా చేతుల్లో..

నీవు ఒకడిని తంతే.. నీ తలను తన్నే వాడు ఇంకొకడు ఉంటాడు. ఈ నానుడి నిజం చేస్తూ ఇక ప్రకటన విడుదల చేసింది దక్షిణ కొరియా. సాధారణంగా ఉత్తర కొరియా ఇదివరకూ చేసిన ఆగడాలు అన్నీ ఇన్నీ కావు. గతంలో మనకు బ్రిటీష్ పాలకులు ఏవిధంగా అయితే జుట్టుకు పన్ను, నీటికి పన్ను అని వేధించారో అదే తరుణంలో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జొంగ్ – ఉన్ అలా నిర్ణయాలు తీసుకున్నారు. తాజాగా పసిబాలిక అని చూడకుండా జీవిత ఖైదు వేసి దుర్మార్గంగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈదేశం ఓ రాకెట్ ప్రయోగాన్ని గగనతలంలోకి పంపే ప్రయత్నం చేసింది. ఇది ఆదిలోనే హంసపాదం అన్నట్లుగా నేలకు రాలింది. ఈ ఉపగ్రహ శకలాలు దక్షిణ కొరియా చేతికి చిక్కాయి. దీంతో దక్షిణ కొరియా అందులోని భాగాలను పరిశీలించి ఆ దేశం వాడుతున్న సాంకేతికతను తెలుసుకోవాలనే ప్రయత్నంలో ఉంది.