TS Congress Tickets: మాటిచ్చారు… టిక్కెట్ ఇస్తారా ? కాంగ్రెస్ లో ఆశావహుల టెన్షన్ !
అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections) టికెట్స్ రాలేదని అసంతృప్తిగా ఉన్న నేతలకు అప్పట్లో రకరకాల తాయిలాలు ప్రకటించింది తెలంగాణ కాంగ్రెస్ అధినాయకత్వం. లోక్సభ సీటు ఇస్తామని కొందర్ని, కార్పొరేషన్ పదవులు ఇస్తామని మరికొందర్ని బుజ్జగించింది. ఇప్పుడిక పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న టైంలో నాటి బాసల ఊసులు తెర మీదికి వస్తున్నాయి. ఫలానా సీటును ఫలానా లీడర్ అంటూ ప్రచారం కూడా మొదలైంది.