Politics: నెల్లూరు వైసీపీ నుంచి మరో వికెట్ డౌన్? జిల్లాలో ఫ్యాన్ పార్టీ పని అయిపోయిందా!
నెల్లూరు వైసీపీలో వరుసగా వికెట్లు కూలిపోతున్నాయ్. ఒకరి తర్వాత ఒకరు.. ఫ్యాన్ పార్టీకి హ్యాండ్ ఇస్తున్నారు. మొన్న ఆనం, నిన్న కోటంరెడ్డి.. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి.. వైసీపీకి నేరుగా గుడ్‌బై చెప్పిన వాళ్లు కొందరయితే.. వెన్నుపోటు పొడిచి మరీ దూరం అయినవాళ్లు ఇంకొందరు. జిల్లా పార్టీలో కీలకంగా ఉన్న ముగ్గురు నేతలు వెళ్లిపోయారన్న బాధలో ఉన్న వైసీపీ శ్రేణులకు.. ఇప్పుడు మరో భారీ ఝలక్ పడబోతోందనే ప్రచారం జరుగుతోంది.