Star Villain

Sanjay Dutt : సంజయ్‌ దత్‌ విలన్‌గానే స్థిరపడిపోతాడా..

Sanjay Dutt : సంజయ్‌ దత్‌ విలన్‌గానే స్థిరపడిపోతాడా..

నార్త్‌లో అతనో స్టార్ హీరో. సౌత్‌తో మాత్రం విలన్ పాత్రలకి పరాకాష్ఠగా మారాడు. హీరోలని డామినేట్ చేసే క్యారెక్టర్స్‌తో విధ్వంసం సృష్టిస్తున్నాడు. ఇప్పటికే శాండిల్ వుడ్‌లో తన సౌండ్ వినిపించింది. కోలీవుడ్‌లోనూ తన కటౌట్ హైలెట్ అయింది. ఇప్పుడు టాలీవుడ్‌లో తన మానియా షురూ కాబోతోంది. బాలీవుడ్ స్టార్ సంజయ్‌దత్‌కి సౌత్‌లో డిమాండ్ పెరిగింది. కేజీఎఫ్‌లో తను చేసిన పాత్ర హైలైట్‌ అవ్వడంతో.. స్టార్ హీరోల కోసం ఖల్ నాయక్‌ ని బరిలో దింపుతున్నారు మేకర్స్. ఇటీవలే విజయ్ లియోలో డిఫరెంట్ క్యారెక్టర్ చేసి మెప్పించాడు సంజయ్ దత్. అర్జున్ లాంటి సీనియర్ మోస్ట్ యాక్టర్ పక్కన ఉన్నా.. తన డామినేషన్‌లో ఎక్కడా తగ్గలేదు.