Sunita

Sharmila: టైమ్‌ చూసి జగన్‌ను దెబ్బకొట్టిన షర్మిల.. ఆ కోపాన్ని ఇలా తీర్చేసుకుందా ?

Sharmila: టైమ్‌ చూసి జగన్‌ను దెబ్బకొట్టిన షర్మిల.. ఆ కోపాన్ని ఇలా తీర్చేసుకుందా ?

ఇది క్రైమ్‌ కథా చిత్రమ్ కాదు.. కుటుంబ కథా చిత్రమ్ అనిపిస్తోంది వివేకా హత్య కేసు విచారణలో పరిణామాలు చూస్తుంటే ! సీబీఐ దూకుడు మీద కనిపిస్తోంది. ఎవరైనా సరే.. ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదు అన్నట్లుగా దూకుడు మీద కనిపిస్తున్నారు సీబీఐ అధికారులు. ఇప్పటికే భాస్కర్‌ రెడ్డిని అదుపులోకి తీసుకుంది. నెక్ట్స్ టార్గెట్‌.. అవినాశ్ రెడ్డే ! అరెస్ట్ ఎప్పుడో చెప్పలేం కానీ.. అరెస్ట్ కావడం పక్కా అన్నట్లుగా ఉంది పరిస్థితి. భాస్కర్‌ రెడ్డి అరెస్ట్‌తో ఇప్పటికే జగన్‌ ఒత్తిడిలోకి వెళ్లిపోయారు. ఆ కేసు నుంచి కుటుంబాన్ని, పార్టీని కాపాడేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.