Rinku Singh: సూపర్ ఓవర్లో మూడు సిక్సులు.. జూనియర్ క్రిస్ గేల్ విధ్వంసం..
17 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మీరట్.. రింకూను బ్యాటింగ్‌కు పంపింది. కాశీ స్పిన్నర్ శివ సింగ్ బౌలర్. తొలి బంతి డాట్. కానీ తర్వాత మూడు బంతులు గాల్లోకి లేచాయి. రెండో బంతిని భారీ సిక్సర్ బాదిన రింకూ.. మూడో బాల్‌ను డీప్ మిడ్ వికెట్ మీదుగా సిక్సర్ కొట్టాడు.