PAWAN KALYAN: అట్టుడుకుతున్న పిఠాపురం.. పవన్‌కు షాక్ తప్పదా..?
పవన్ పోటీని వ్యతిరేకిస్తూ స్థానిక టీడీపీ నేత వర్మ అనుచరులు రోడ్డెక్కారు. టీడీపీ జెండాలు తగలబెట్టారు. పార్టీ వర్మను మోసం చేసిందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఇన్నేళ్లుగా పార్టీ కోసం పని చేయించుకుని.. ఇప్పుడు బయటి నుంచి వచ్చిన వ్యక్తికి టికెట్ ఎలా ఇస్తారంటూ డిమాండ్ చేశారు.