T BJP: టీ బీజేపీపై దుష్ప్రచారం వెనుక బీఆర్ఎస్..? బీజేపీ ఏం చేయబోతుంది..? కౌంటర్ ప్లాన్ రెడీయా..?
బండికి కేంద్ర మంత్రి పదవి, అసంతృప్తుల తిరుగుబాటు, బీజేపీ-బీఆర్ఎస్ రెండూ ఒకటే అనే ప్రచారం బీజేపీకి భారీ నష్టం కలిగించింది. ఈ ప్రచారం వెనుక ఎవరున్నారో తెలుసుకునేందుకు పార్టీ అధిష్టానం ప్రయత్నిస్తోంది. ఇదంతా బీఆర్ఎస్ కుట్రలో భాగంగానే జరుగుతోందని, దీనిద్వారా బీఆర్ఎస్ రాజకీయ లబ్ధి పొందాలి అనుకుంటోందని బీజేపీ పెద్దలు అనుకుంటున్నారు.