YS Jagan: చంద్రబాబు పరామర్శిస్తుంటే నువ్వేం చేస్తున్నావ్ జగన్.. అన్నదాతను ఆదుకునే టైమ్ కూడా లేదా..?
ఇదేం కాలమో.. ఇదేం కలకలమో అర్థం కావడం లేదు ఎవరికీ ! రోహిణీ కార్తెలో రోళ్లు పగిలే ఎండలు ఉంటాయనుకుంటే.. అన్నదాతల బతుకులను కూల్చే వానలు పడుతున్నాయ్. వరి పంట కోతకు వచ్చిన సమయం ఇది. కల్లాల్లో ఏవి నీళ్లో, కన్నీళ్లో అర్థం కాని పరిస్థితి. దేవుడిని, బతుకులను తిట్టుకొని.. నీళ్లు నిండిన కళ్లతో ఆశగా ప్రభుత్వం వైపు చూస్తున్నాడు రైతన్న ఇప్పుడు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి.