Talaiva

Rajinikanth: రజనీ వ్యవహారంలో మోహన్‌బాబు సైలెన్స్‌.. దోస్తీ అంటే ఇదేనా సారూ..

Rajinikanth: రజనీ వ్యవహారంలో మోహన్‌బాబు సైలెన్స్‌.. దోస్తీ అంటే ఇదేనా సారూ..

మనం ఒకరిని నిజంగా ఇష్టపడితే.. వాళ్ల తప్పులను కూడా ఇష్టపడాలి. లేదంటే ఇష్టపడడం లేదని ఒప్పుకోవాలి. అదే నిజమైన స్నేహం కూడా ! మన అనుకున్న వాళ్లు తప్పు లేదని తెలిసినా.. అందులో ఇబ్బంది పడుతున్న వ్యక్తి నుంచి తప్పించుకు తిరిగితే.. స్నేహానికి ఇంకేం విలువ ఉంటుంది. మోహన్‌బాబును చూసి టాలీవుడ్ అంతా అంటోంది ఇదే ఇప్పుడు ! మోహన్‌బాబు, రజనీకాంత్‌ చాలా థిక్ ఫ్రెండ్స్‌. రజనీ ఎప్పుడూ తమ స్నేహం స్థాయి ఇదీ అని ప్రత్యేకంగా చెప్పుకోకపోయినా.. బిల్డప్‌ కోసమో, గుర్తు చేయడం కోసమో కానీ.. ఆ స్నేహాన్ని ప్రతీసారి గుర్తు చేస్తుంటాడు మోహన్‌ బాబు.