Pawan – Trivikram : పవన్, అట్లీ కాంబో… రూ. 1000 కోట్ల తో మూవీ ..
కొందరు హీరోలు చేసే సినిమాలు తక్కువే అయినా సోషల్ మీడియాలో మాత్రం హడావిడి ఎక్కువ కనిపిస్తుంటుంది. సినిమాలు చేసినా చెయ్యకపోయినా కొత్త కాంబినేషన్లు సెట్ అవుతున్నాయంటూ వార్తలు వస్తూనే ఉంటాయి. అది రాను రాను కామెడీగా మారిపోతోంది. ప్రస్తుతం పవన్కళ్యాణ్ విషయంలో అదే జరుగుతోంది. ఓ పక్క రాజకీయాల్లో (AP Politics) తల మునకలై ఉన్న పవన్ను కొత్త కాంబినేషన్లు చుట్టుముడుతున్నాయి. ఇప్పటికే పూర్తి చెయ్యాల్సిన సినిమాలు ఉన్నాయి.