TSPSC GROUP 1: తెలంగాణ గ్రూప్-1 నోటిఫికేషన్ రద్దు.. కొత్త నోటిఫికేషన్ ఎప్పుడంటే..
దాదాపు రెండేళ్లక్రితం 503 పోస్టులతో గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదలైంది. కానీ, రెండేళ్లక్రితం తొలిసారి నిర్వహించిన గ్రూప్-1 పేపర్ లీకైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పేపర్ లీకేజీతోపాటు ఇతర అంశాల్ని పరిగణనలోకి తీసుకుని, పాత నోటిషికేషన్ రద్దు చేస్తున్నట్లు టీఎస్పీఎస్సీ సెక్రెటరీ డా.నవీన్ నికోలస్ పేర్కొన్నారు.