YS Sharmila: నేతలపై బూతులు.. పోలీసులపై దాడులు.. షర్మిలది ఫ్రస్ట్రేషనా.. పక్కా వ్యూహమా ?
వైఎస్ షర్మిల.. తెలంగాణ రాజకీయాల్లో అడుగు పెట్టడమే ఓ వివాదం. వైఎస్‌ఆర్ కూతురుగా తెలంగాణలో రాజకీయాలు చేస్తానని ముందుకొచ్చిన షర్మిల.. వైటీపీ అని ఓ పార్టీ పెట్టి రాజకీయాలు మొదలుపెట్టారు. అన్నీ తానై.. అన్నింటికి తానై అన్నట్లుగా.. ఎనీ వేర్ సింగిల్ హ్యాండ్ అనేలా షర్మిల ఒక్కరే పోరాడుతున్నారు. వైఎస్ఆర్ అభిమానులు ఉన్నారు.. ఆమె కూతురుగా ఓ పార్టీ పెడితే.. అంతా వస్తారు పార్టీ బలం అవుతుంది.. ఇలా ఎన్నో అంచనాలు కనిపించాయ్ షర్మిలలో తొలినాళ్లలో ! సీన్ మొత్తం రివర్స్ అయింది.