Revanth Reddy : నా దగ్గర గన్స్ ఉన్నాయి.. రేవంత్ ఎలక్షన్ అఫిడవిట్ వైరల్
తెలంగాణలో ప్రతిపక్షంలో ఉన్నా కూడా పవర్‌ఫుల్ నేతల్లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఒకరు. ప్రస్తుతం మల్కాజ్‌గిరి ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డి.. వచ్చే ఎన్నికల్లో కొండంగల్, కామారెడ్డి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఇప్పటికే రెండు చోట్లా నామినేషన్ వేసి ప్రచారం కూడా ప్రారంభించారు. నామినేషన్‌లో భాగంగా తన ఆస్తుల వివరాలు ఎన్నికల అధికారులకు సమర్పించారు రేవంత్ రెడ్డి. ఈ వివరాల్లో రేవంత్ రెడ్డి దగ్గర రెండు గన్స్ ఉన్నాయని తెలియడం.. ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.