Car Number: రికార్డులు బద్దలు.. కారు నెంబర్ కోసం రూ.122 కోట్లు.. ఇంతకీ ఆ నెంబరేంటో తెలుసా?
దుబాయ్‌కు చెందిన ఒక సంస్థ కారు నెంబర్లను వేలం వేస్తుంటుంది. అక్కడి షేక్‌లు, వ్యాపారవేత్తలు వీటి కోసం ఎంతైనా ఖర్చు పెడతారు. తాజాగా ఒక వ్యక్తి కారు నెంబర్ కోసం ఏకంగా రూ.122 కోట్లు వెచ్చించాడు. కారు నెంబర్ కోసం జరిగిన వేలంలో ఒక వ్యక్తి 55 మిలియన్ దిర్హామ్‌లు పెట్టి, ఆ నెంబర్ దక్కించుకున్నాడు.