Ugram Movie: అల్లరి నరేష్ ఉగ్ర రూపానికి ఆడియన్స్ ఫిదా.. ఉగ్రం ఫుల్ మూవీ రివ్యూ..
కొంత కాలంగా అల్లరి మానేసిన నరేష్ సీరియస్ సినిమాలతో దూసుకుపోతున్నాడు. నాంది సినిమాతో డిఫరెంట్ క్యారెక్టర్ ట్రై చేసి విమర్శకుల మార్కులు కూడా కొట్టేశాడు. ఇప్పుడు అదే డైరెక్టర్‌తో ఉగ్రం సినిమా తీసి మరో హిట్ అందుకున్నాడు. సినిమా బ్లాక్ బస్టర్ అని చెప్పకపోయినా.. ఫస్ట్ షోకే పాజిటివ్ టాక్ వచ్చింది. సినిమా చూసినవాళ్లంతా చాలా బాగుంది అంటున్నారు. ఇన్వెస్టిగేషన్ త్రిల్లర్గా సాగే ఈ సినిమాలో అల్లరి నరేష్ నిజంగానే ఉగ్ర రూపం చూపించాడంటున్నారు ఆడియన్స్.