సీఎంను ఓడించాడు.. కాబోయే సీఎంనూ ఓడించాడు.. ఎవరీ వెంకటరమణా రెడ్డి..
తెలంగాణ ఎన్నికల కౌంటింగ్ మొత్తం ఒకలా ఉంటే కామారెడ్డి లెక్క మాత్రం వేరేలా ఉంది. ప్రతీ రౌండ్‌లో పరిస్థితి మారిపోయింది. సింపుల్‌గా చెప్పాలంటే ఓ థ్రిల్లర్ సినిమాను తలపించింది కామారెడ్డి కౌంటింగ్. షాక్‌లు.. ట్విస్ట్‌లు.. ఝలక్‌లు దెబ్బ మీద దెబ్బ అన్నట్టు.. ఆఖరి క్షణం వరకూ ఉత్కంఠ రేపింది కామారెడ్డి ఓట్ల లెక్కింపు ప్రక్రియ. మాజీ సీఎం కేసీఆర్ కేసీఆర్, కొత్తగా సీఎం కాబోయే రేవంత్ రెడ్డి ఇద్దరూ ఇక్కడి నుంచి పోటీ చేశారు.