కోల్ కత్తా పక్కా ప్లానింగ్, కెప్టెన్ గా రహానేకే ఛాన్స్
ఐపీఎల్ మెగావేలం ముగిసిపోవడంతో ఫ్రాంచైజీలు ఇప్పుడు తమ కొత్త కెప్టెన్, జట్టు కూర్పుపై ఫోకస్ పెట్టాయి. వచ్చే సీజన్ లో పలు జట్లకు కొత్త సారథులు రాబోతున్నారు. డిఫెండింగ్ ఛాంపియన్ కోల్ కత్తా నైట్ రైడర్స్ సైతం కొత్త కెప్టెన్ తోనే వచ్చే సీజన్ లో బరిలోకి దిగబోతోంది.