Telangana BJP: బీజేపీలో కోవర్టులు.. ఇంతకీ వాళ్లెవరు..? కాంగ్రెస్‌లా తయారవుతున్న బీజేపీ!
కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ భారీగా పడిపోయింది. ఒకవేళ అక్కడ పార్టీ గెలిచుంటే పరిస్థితి వేరేలా ఉండేదేమో. కానీ, ఓడిపోవడంతో పార్టీ ఇమేజ్ దెబ్బతింది. పార్టీ శ్రేణులు నిరాశలో కూరుకుపోయాయి. దీంతో ఇప్పుడు తమ రాజకీయ భవిష్యత్ ఏంటా అని బీజేపీ నేతలు ఆలోచిస్తున్నారు.