KADAPA : కడపలో వైఎస్ షర్మిల vs వైఎస్ అవినాష్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఈసారి కడప లోక్ సభ స్థానంలో బిగ్ ఫైట్ జరగబోతోంది. మొదటిసారి ఇక్కడ వైఎస్ కుటుంబం నుంచి అక్కా తమ్ముడు పోటీ పడుతున్నారు. ఈ ఇద్దరిలో ఎవరు గెలుస్తారు… ఎవరు ఓడిపోతారు… అన్నది ఆంధ్ర పాలిటిక్స్ లో టెన్షన్ రేపుతోంది. కాంగ్రెస్ నుంచి ఫస్ట్ టైమ్ షర్మిల బరిలోకి దిగుతుంటే… వైసీపీ అభ్యర్థిగా ఆమె తమ్ముడు అవినాశ్ రెడ్డి మూడోసారి పోటీ చేస్తున్నారు. టీడీపీ అభ్యర్థిగా భూపేశ్ రెడ్డి బరిలో ఉన్నా… అక్కా తమ్ముడి మధ్యే ప్రధాన పోటీ.