కఠినమైన చట్టాలు చేయడం.. వాటిని అంతే కఠినంగా అమలు చేయడంలో నూటికి నూరుపాళ్లు నిక్కచ్చిగా వ్యవహరించే సింగపూర్ ప్రపంచ దేశాలు వద్దంటున్నా సరే తాను అనుకున్న పనిచేసింది. గంజాయి స్మగ్లింగ్ చేశాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న భారతీయ మూలాలు ఉన్న వ్యక్తిని కొన్ని గంటల క్రితం ఉరితీసింది. దాదాపు కేజీ గంజాయిని సింగపూర్ తరలించడంలో కీలక పాత్ర పోషించాడని అభియోగాలు ఎదుర్కొంటున్న 46 సంవత్సరాలు తంగరాజు సుప్పయ్యను సింగపూర్ అధికారులు ఉరి తీశారు. చంగి ప్రిజన్ కాంప్లెక్స్ లో తంగరాజు సుప్పయ్యను ఉరితీసినట్టు సింగపూర్ ప్రభుత్వం ప్రకటించింది.

Singapore Government Punish to Indian