100 కోట్ల మంది ఫాలోవర్స్… రొనాల్డో సరికొత్త చరిత్ర

వరల్డ్ సాకర్ సూపర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో గ్రౌండ్ లోనే కాదు గ్రౌండ్ బయట కూడా రికార్డుల మోత మోగిస్తున్నాడు.

Post Published By: Vencateshg
Updated : 13 September 2024, 7:43 PM IST

వరల్డ్ సాకర్ సూపర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో గ్రౌండ్ లోనే కాదు గ్రౌండ్ బయట కూడా రికార్డుల మోత మోగిస్తున్నాడు. మైదానంలో తనదైన మంత్రముగ్ధమైన ఆటతో కోట్లాది మంది ఫ్యాన్స్ సంపాదించుకున్న రొనాల్డో తాజాగా సోషల్ మీడియాలో చరిత్ర సృష్టించాడు. అన్ని సోషల్ మీడియా వేదికల్లో కలిపి 100 కోట్ల మంది ఫాలోవర్స్ మార్క్ ను అందుకున్నాడు. ఈ పోర్చుగల్ దిగ్గజ ఆటగాడికి ఇన్‌స్టాగ్రామ్‌లో సుమారు 64 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ట్విటర్‌లో 11.3 కోట్ల మంది, ఫేస్‌బుక్‌లో 17 కోట్ల మంది యూట్యూబ్‌లో ఆరు కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. కాగా రొనాల్డో ఇటీవలే తన కెరీర్‌లో 900 గోల్స్ మైలురాయి అందుకున్నాడు. ఇక 100 కోట్ల మంది ఫాలోవర్స్ తో చరిత్ర సృష్టించిన రొనాల్డో తన అభిమానులకు థ్యాంక్స్ చెబుతూ పోస్ట్ చేశాడు.

Published : 
  • 13 September 2024, 7:43 PM IST