ఆస్ట్రేలియాకు మరో షాక్… ఒలింపిక్స్ లోనూ నో ప్లేస్…!

టీ20 ప్రపంచ కప్ 2026 టోర్న‌మెంట్ నుంచి గ్రూప్ స్టేజ్ లోనే ఇంటిదారి పట్టిన ఆస్ట్రేలియాకు ఆస్ట్రేలియా జ‌ట్టుకు మ‌రో షాక్ త‌గిలింది.

Post Published By: dialnews
Updated : 19 February 2026, 4:25 PM IST

టీ20 ప్రపంచ కప్ 2026 టోర్న‌మెంట్ నుంచి గ్రూప్ స్టేజ్ లోనే ఇంటిదారి పట్టిన ఆస్ట్రేలియాకు ఆస్ట్రేలియా జ‌ట్టుకు మ‌రో షాక్ త‌గిలింది. 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ లో ఆస్ట్రేలియా స్థానం గ‌ల్లంతు అయిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ మెగా టోర్నీలో గ్రూప్ స్టేజ్ లోనే ఎలిమినేట్ కావడం దీనికి కారణంగా కనిపిస్తోంది. ఆస్ట్రేలియా స్థానంలో న్యూజిలాండ్ 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ లో ప్లేస్ ఖ‌రారు చేసుకున్న‌ట్లు చెబుతున్నారు. న్యూజిలాండ్ సూప‌ర్ 8 లోకి వెళ్లిన నేప‌థ్యంలో ఆస్ట్రేలియా స్థానం ఒలింపిక్స్ లో స్థానం గ‌ల్లంతయింది.

టైటిల్ ఫేవరెట్ గా ఉన్న ఈ సారి ఆస్ట్రేలియా అత్యంత దారుణ ప్ర‌ద‌ర్శ‌న క‌నబ‌రిచింది. గ్రూప్ స్టేజ్ లోనే ఆస్ట్రేలియా ఎలిమినేట్ అయింది. జింబాబ్వే చేతిలో మొద‌ట ఓడిన ఆస్ట్రేలియా, ఆ త‌ర్వాత శ్రీలంక చేతిలో కూడా ఓడింది. అటు పాయింట్ల పట్టిక‌లో ఆస్ట్రేలియా కంటే ఎక్కు వ పాయింట్లు సాధించిన జింబాబ్వే సూప‌ర్ 8 లోకి దూసుకెళ్లింది. దీంతో ఈ గ్రూప్ బీలో ఉన్న శ్రీలంక, జింబాబ్వే రెండు జ‌ట్లు కూడా సూప‌ర్ 8 లోకి దూసుకెళ్లింది.2028లో జరిగే లాస్ ఏంజిల్స్ ఒలంపిక్స్ లో అర్హత సాధించాలంటే కొన్ని నియమాలు ఉన్నాయి. ఈ సారి ఈ ఒలంపిక్స్ లో క్రికెట్ కూడా ప్రవేశపెడుతున్నారు. ప్రతి ఖండం నుంచి ఒక ర్యాంకింగ్స్ లో అగ్రశ్రేణిగా ఉన్న జట్టును ఈ లాస్ ఏంజిల్స్ ఒలంపిక్స్ లోకి తీసుకోనున్నారు.

సదరు జట్టు కచ్చితంగా ర్యాంకింగ్స్ లో అగ్రశ్రేణిగా ఉండడమే కాకుండా అద్భుతంగా రాణించాలి. ఇందులో భాగంగానే ఓసియానియా ప్రాంతం నుంచి ఆస్ట్రేలియాకు మొన్నటి వరకు ఛాన్స్ ఉంటుందని ప్రచారం జరిగింది. కానీ టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నుంచి గ్రూప్ దశలో ఎలిమినేట్ అయింది ఆస్ట్రేలియా.ఇదే ప్రాంతం నుంచి వచ్చిన న్యూజిలాండ్ మాత్రం సూపర్ 8 లోకి దూసుకు వెళ్ళింది. ఈ స్టేజ్ లో న్యూజిలాండ్ అద్భుతంగా రాణించి సెమీ ఫైనల్ దాకా వెళ్తే , ర్యాంకింగ్ ప్రకారం మరింత బలపడుతుంది. అప్పుడు ఆస్ట్రేలియాను ర్యాంకింగ్స్ లో న్యూజిలాండ్ వెనక్కి నెట్టే అవకాశాలు ఉంటాయి. ఇదే జరిగితే 2028 లాస్ ఏంజిల్స్ ఒలంపిక్స్ కు ఆస్ట్రేలియా స్థానంలో న్యూజిలాండ్ క్వాలిఫై అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Published : 
  • 19 February 2026, 4:25 PM IST