రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ రాజాసాబ్ రిజల్ట్ వల్ల డిసప్పాయింట్ అయ్యారు. అందులో ఎలాంటి డౌట్ లేదు. ఓపెనింగ్స్ 150 కోట్లు, రెండు వారాల కలెక్సన్స్ 225 కోట్లు… ఈ రెండీంటి మధ్య ఉన్న గ్యాప్ కొంతవరకు రెబల్ ఫ్యాన్స్ కోపానికి కారణం.. అయితే ఇందులో కూడా ఒక విచిత్రమైనా రికార్డు రెబల్ స్టార్ ప్రభాస్ కే దక్కింది. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, పీక్స్ లో ఉన్నప్పుడు కూడా ప్రభాస్ కి దక్కిన రికార్డుని వాల్లు సొంతం చేసుకోలేకపోయారు. వాళ్ల జూనియరే అయినా, పాన్ ఇండియా లెవల్లో ప్రభాస్ కి ఏడో రికార్డు సొంతమైంది. బేసిగ్గా హిట్ మూవీలతో ఎవరైనా రికార్డులు బద్దలు కొట్టడం కామన్. రెబల్ స్టార్ ప్రభాస్ కూడా పాన్ ఇండియా లెవల్లో 5 హిట్లు సొంతం చేసుకున్నాడు. రెండు సినిమాలైతే 1000 కోట్ల క్లబ్ లో చేరాయి.. ఒకటి 850 కోట్లతో థౌఝెండ్ క్రోర్స్ కి దగ్గరగా వెల్లింది.. మరి ఈ ఐదు పాన్ ఇండియా హిట్లు కాకుండా, ప్రభాస్ ఎకౌంట్ లో పడ్డ మరో రెండు రికార్డులు ఏంటి? వాటితో ఎలా ప్రభాస్ ఎకౌంట్ లో సెవన్ వండర్స్ చేరాయి…? డిజాస్టర్ పడ్డ టైంలో కూడా రికార్డులు సొంతం చేసుకున్న ఒకే ఒక్కడిగా తనేలా మారాడు?
రెబల్ స్టార్ ప్రభాస్ రీసెంట్ గా తన రాజసాబ్ మూవీ తో డిసప్పాయింట్ చేయొచ్చు.. హర్రర్ కామెడీ చేయాలన్న తన కలని డైరెక్టర్ మారుతి సరిగా టేకాఫ్ చేయలేకపోయుండొచ్చు.. దీనికి తోడు సంక్రాంతికి ఈ సినిమా దుమ్ముదులిపితే 2026 ని గ్రాండ్ గా ఓపెన్ చేసిన రికార్డు కూడా దక్కేది.. అవేవి దక్కకపోగా, సంక్రాంతికి వచ్చిన అన్నీ సినిమాలు హిట్టయ్యాయి… ఒక్క రాజసాబే రిజల్టే రివర్స్ అవటం, ఫ్యాన్స్ తట్టుకోలేకపోయారు.. అందుకే ఇన్ని రోజుల తర్వాత సడన్ గా మళ్లీ మారుతి మీద ఫైర్ అవుతున్నారు..ఇలాంటి టైంలో ఏడు రికార్డుల హిస్టరీ రెబల్ స్టార్ కి దక్కుతోంది. ఇదే విచిత్రం… బేసిగ్గా హిట్లున్నప్పుడు రికార్డులు దక్కడం కామన్.. కాని తన రాజాసాబ్ రిజల్ట్ రివర్స్ అయిన టైంలో కూడా, వసూల్ల విషయంలో తనే రాజాసాబ్ అనిపించుకున్నాడు. రాజాసాబ్ మొదటి రోజు 150 కోట్ల వసూళ్ళొచ్చాయి.. తర్వాత వచ్చిన వసూళ్లన్ని కలిపితే,225 కోట్లు…
నిజానికి ప్రభాస్ రేంజ్ కి వెయ్యికోట్లు కామన్ గా మారాలి.. కాని కథాలోపం, మారుతి పాపం ఈ సినిమా వసూల్లని సాంతం ముంచేసింది. అయినా తన క్రేజ్ వల్లే ఈ మూవీ డిజాస్టర్ టాక్ తో కూడా 225 కోట్లు రాబట్టింది.. ఓటీటీ బిజినెస్ తో కలిపి పెట్టుబడి కూడా వచ్చేసిట్టుంది..ఐతే ఇక్కడ రికార్డు తాలూకు రీసౌండ్ చేస్తోంది ఏంటంటే, ఏ హీరో కెరీర్ లో లేనన్ని వసూల్ల రికార్డులు ప్రభాస్ ఎకౌంట్ లో పడటం..ఔను 200 కోట్ల వసూళ్లు దాటిన సినిమాలు ఎక్కువగా ఎవరికి వచ్చాయంటే రెబల్ స్టార్ ప్రభాస్ పేరే వినిపిస్తోంది. బాహుబలి 1, బాహుబలి 2, సాహో, ఆదిపురుష్, కల్కీ, సలార్, ది రాజాసాబ్ ఇలా వరుసగా 7 సినిమాలు 200 కోట్ల నుంచి 1850 రాబట్టాయి.. ఇలాంటి రికార్డు ఖాన్లకు కపూర్లకు లేదు… షారుఖ్ కూడా తన కెరిర్ లో 1000 కోట్ల వసూల్లని జవాన్, పటాన్ తో రుచి చూశాడు.. కట్ చేస్తే మళ్లీ 200 కోట్ల పైనే వసూల్లు రాబట్టిన సినిమాల లిస్ట్ తీస్తే తనవి కేవలం ఐదంటే ఐదే ఆ లిస్ట్ లో ఉన్నాయి..
బాలీవుడ్ లోనే కాదు సూపర్ స్టార్ రజినీకాంత్ కి కూడా 200 కోట్ల వసూలస్ల రికార్డు 6 సినిమాలకే పరిమితమైంది… మహేశ్ బాబు, ఎన్టీఆర్, బన్నీ, రామ్ చరణ్, యష్ ఇలా ఎవరి సినిమాల లిస్ట్ తీసినా 7 సినిమాలకు పైనే మూవీలు 200 కోట్లు రాబట్టడం అనేది, రెబల్ స్టార్ కేదక్కిన రికార్డు. సో రాజసాబ్ ఫెల్యూర్ అయినప్పటికి 200 కోట్ల సినిమాల లిస్ట్ లో ఇదే ఏడో మూవీగా మారి, రెబల్ స్టార్ రేంజ్ ఏంటో ఇక్కడ కూడా ప్రూవ్ చేస్తోంది.