పవన్ కళ్యాణ్, సురేందర్ రెడ్డి కాంబోలో బిగ్ అప్‌డేట్.. ఫిబ్రవరి నుంచే యాక్షన్ షురూ..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు ఇది నిజంగా పండగ లాంటి వార్తే. రాజకీయాల్లో ఉప ముఖ్యమంత్రిగా బిజీగా ఉన్నప్పటికీ.. తన కమిట్మెంట్స్ ప్రకారం వరుస సినిమాలతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు.

  • Written By:
  • Publish Date - January 26, 2026 / 10:00 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు ఇది నిజంగా పండగ లాంటి వార్తే. రాజకీయాల్లో ఉప ముఖ్యమంత్రిగా బిజీగా ఉన్నప్పటికీ.. తన కమిట్మెంట్స్ ప్రకారం వరుస సినిమాలతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. తాజా సమాచారం ప్రకారం స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితో పవన్ చేయబోయే సినిమా ఫిబ్రవరిలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి చాలా రోజులుగా ఇండస్ట్రీలో చర్చ జరుగుతున్నా.. ఇప్పుడు పక్కాగా షూటింగ్ అప్‌డేట్ రావడంతో అభిమానుల్లో జోష్ పెరిగింది. మెగా కాంపౌండ్‌లో డైరెక్టర్ సురేందర్ రెడ్డికి అద్భుతమైన ట్రాక్ రికార్డ్ ఉంది. గతంలో అల్లు అర్జున్‌తో ‘రేసుగుర్రం’, రామ్ చరణ్‌తో ‘ధ్రువ’, మెగాస్టార్ చిరంజీవితో ‘సైరా నరసింహారెడ్డి’ వంటి సినిమాలు ఇచ్చారు.

ఇప్పుడు పవన్ కళ్యాణ్ వంతు వచ్చింది. మెగా హీరోలకు బాగా కలిసొచ్చిన డైరెక్టర్ కావడంతో.. ఈ కాంబినేషన్ మీద అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. పవన్ ఇమేజ్‌కి, ఆయన పొలిటికల్ స్టేచర్‌కి తగ్గట్టుగా సురేందర్ రెడ్డి ఒక పవర్ ఫుల్ సోషల్ మెసేజ్ ఉన్న కమర్షియల్ స్క్రిప్ట్‌ను రెడీ చేశారని టాక్. ఈ భారీ చిత్రాన్ని ఎస్.ఆర్.టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. పవన్ కళ్యాణ్‌కు అత్యంత సన్నిహితుడైన రామ్ తాళ్లూరి.. ఈ సినిమాను ఎక్కడా రాజీ పడకుండా భారీ బడ్జెట్‌తో హై టెక్నికల్ వాల్యూస్‌తో తెరకెక్కించనున్నారు. ఇప్పటికే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో బిజీగా ఉన్న పవన్.. తన డేట్స్ అడ్జస్ట్ చేసి మరీ ఈ సినిమాను త్వరగా పట్టాలెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన ప్రచారం జరుగుతోంది. ఈ మూవీ కోసం పవన్ కళ్యాణ్ ఒక సపరేట్ హెయిర్ స్టైల్‌ను మెయింటైన్ చేస్తున్నారట.

గత కొద్ది రోజులుగా పవన్ లుక్‌లో మార్పు కనిపిస్తుండటం, ఆయన హెయిర్ స్టైల్ చూస్తుంటే.. ఇది కచ్చితంగా సురేందర్ రెడ్డి సినిమా మేకోవర్ కోసమేనని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. చాలా కాలం తర్వాత పవన్‌ను సరికొత్త స్టైలిష్ అవతారంలో.. సురేందర్ రెడ్డి మార్క్ టేకింగ్‌లో చూడబోతున్నామని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టి.. వీలైనంత త్వరగా సినిమాను పూర్తి చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. పొలిటికల్ పవర్, సినిమా గ్లామర్ రెండూ బ్యాలెన్స్ చేస్తూ పవన్ కళ్యాణ్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు బయటకు రానున్నాయి.