2026 మీద సాలిడ్ గా దాడి చేసేది ఎవరు అన్న ప్రశ్నకు ముందు రాజాసాబ్ పేరు వినిపించింది. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు రెబల్ స్టార్ రాజాసాబే ఈ ఏడాదిని సాలిడ్ కలెక్షన్స్ తో కుదిపేస్తాడనుకున్నారు. కాని అక్కడే మిస్ ఫైర్ అయ్యింది. విచిత్రం ఏంటంటే పెద్ది వాయిదా పడుతోంది కాబట్టి, అదెప్పుడు వస్తుందన్న విషయంలో క్లారిటీ లేదు. అందుకే ఈ ఏడాదిని ముందుగా పాన్ ఇండియా లెవల్లో ఊపేదెవరు? అన్న ప్రశ్నకు మళ్లీ రెబల్ స్టార్ ప్రభాస్ పేరే వినిపిస్తోంది. తన ఫౌజీ మూవీనే దసరా దరువుకి సిద్దమైందా? దసరా పండక్కి ఫౌజీని ఎలాగైనా రిలీజ్ చేయాలని ఫిక్స్ చేశారా? సమ్మర్ పూర్తయ్యేలోపు ఫౌజీ పెండింగ్ షూటింగ్ మొత్తం పూర్తవుతుందా? రాజాసాబ్ తో మిస్ అయ్యింది, ఫౌజీగా ప్రభాస్ సాధిస్తాడా? ఎందుకు దసరాకే ఫౌజీని రిలీజ్ చేయటం ఫిక్స్ అంటున్నారు?
2026 లో పాన్ ఇండియాని కుదిపేసే సినిమా అంటే రాజాసాబ్ అనుకున్నారు. కాని మారుతి మహాత్యం వల్ల సీన్ రివర్స్ అయ్యింది. పెద్ది వస్తుందనుకుంటే, రిలీజ్ డేట్ వాయిదాలు కన్ఫామ్ అయ్యాయి. కనీసం డ్రాగన్ అయినా సమ్మర్ లేదంటే జూర్ కి వస్తుందనుకుంటే, ఏకంగా వచ్చే సంక్రాతికే వాయిదా పడింది. మరి ఈ ఏడాదిని పాన్ ఇండియా వసూళ్ల తో దుమ్ముదులిపేది ఎవరంటే, మళ్లీ ప్రభాస్ పేరే వినిపిస్తోంది.ఎందుకంటే హను రాఘవపూడీ మేకింగ్ లో తను చేస్తున్ ఫౌజీ ఎట్టి పరిస్థితుల్లో దసరా రిలీజ్ అయ్యి తీరుతుందని తేలింది.
దసరా కి రిలీజ్ అయ్యే ప్రమోషన్ ని కూడా మే నుంచే ప్లాన్ చేస్తున్నట. టీజర్ లాంచ్, గ్లింప్స్, మోషన్ పోస్టర్, దేశంలో పది నగరాల్లో పది గ్రాండ్ ఈవెంట్ ల ప్లానింగ్ చూస్తుంటే ఫౌజీ రాక దసరా ఫిక్స్ చేసుకోవాల్సి వస్తోంది.రాజాసాబ్ కి సాలిడ్ ప్రమోషన్ లేదు… అసలు ప్రభాస్ కి కుదర్లేదు. కాని ఫౌజీ మూవీ గ్లింప్స్ ని కాశ్మీర్ లో జవాన్ల మధ్య రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యిందట ఫిల్మ్ టీం. కాని దానికి మే డేకి సంబంధం ఏంటో మాత్రం టీజర్ లాంచింగ్ రోజేతేలే ఛాన్స్ఉంది. కాశ్మీర్ లో గ్లింప్స్ తో మొదలయ్యే ఫౌజీ ప్రమోషన్ కన్యాకుమారిలో రిలీజ్ చేసే ట్రైలర్ తో ఎండ్ అవుతుందని తెలుస్తోంది.
అంటే దసరాకి నెల ముందు కణ్యాకుమారిలో భారీ ఈవెంట్ ఉండబోతోందని చెప్పకనే చెప్పినట్టౌైతోంది. అంతేకాదు హైద్రబాద్, వైజాగ్, బెంగులూరు,మంగుళూరు, కొచ్చి, మున్నార్, చెన్నై, డిల్లీ, ముంబాయ్, అహ్మదాబాద్, లక్నౌ, కోల్ కతాలో ఈ ప్రమోషనల్ ఈవెంట్లు గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. 60శాతం షూటింగ్ పూర్తైన ఫౌజీ సమ్మర్ లోగా మొత్తం షూటింగ్ కి గుమ్మడి కాయకొట్టబోతోంది.సో మేనుంచి అసలు ప్రమోషన్ ని మొదలు పెట్టి, రిలీజ్ కి నాలుగైదు నెలల ముందునుంచే హైప్ తెచ్చే ప్రయత్నం చేస్తున్నాడు రెబల్ స్టార్. అంతా రాజాసాబ్ ఎఫెక్టో లేదంటో, తనే రంగంలోకి దిగి ఫౌజీ నుంచి ప్రతీ మూవీ విషయంలో తానే జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటున్నాడో.. మొత్తానికి ప్రభాస్ స్ట్రాటజీ మార్చాడు.