మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించాలని ఎన్టీఆర్ డిసైడ్ అయినట్టున్నాడు. ఒకే సారి డబుల్ డోస్ కి రెడీ అయ్యాడు. ఆల్రెడీ డ్రాగన్ గా డ్యూయెల్ రోల్ వేస్తున్న ఎన్టీఆర్, ఇప్పుడు డ్యూయెల్ ప్రాజెక్టులు పట్టాలెక్కిస్తున్నాడు. ఓరకంగా కొరటాల శివ నెత్తిన పాలుపోస్తున్నాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ … త్రివిక్రమ్ తో అనుకున్న ప్రాజెక్టులో చిన్న చితాక ఇబ్బందులు వచ్చినా, ఫైనల్ గా మాటల మాంత్రికుడు తన తప్పు తెలుసుకోవటంతో, అంతా సెట్ అయిపోయింది. గాడ్ ఆఫ్ వార్ ప్రాజెక్ట్ పట్టాలెక్కే టైం వచ్చింది. ఎగ్జాక్ట్ గా ఇలాంటి టైంలోనే కొరటాల శివ, ఎన్టీఆర్ మీటింగ్ తో దేవర సీక్వెల్ కి అన్ని దార్లు తెరుచుకుంటున్నాయి. తనని నమ్ముకుని ఉన్న దర్శకుడికోసం, రాజమౌళి సెంటిమెంట్ నుంచి తనని కాపాడిన ప్రాజెక్ట్ కోసం, ఎన్టీఆర్ డేట్లిచ్చాడు.. ఒకేసారి జూన్ లో జోష్ పెంచబోతున్నాడు. ఒకటి కాదు, రెండు ప్రాజెక్టులు అప్పుడే మొదలౌతాయా? దేవర సీక్వెల్ లోమళ్లీ తండ్రి పాత్ర కనిపించబోతుందా?
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవర, గాడ్ ఆఫ్ వార్ రెండీంటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా? సడన్ గా కొరటాల శివ ఎందుకుఎన్టీఆర్ ని కలిశాడు..? త్రివిక్రమ్ చెప్పిన శారి వల్ల గాడ్ ఆఫ్ వార్ ప్రాజెక్ట్ సమస్యలన్నీ తీరిపోయినట్టేనా? ఈ డౌట్లన్నీంటికి ఆన్సర్ దొరికింది. డ్రాగన్ ప్రజెంట్ షెడ్యూల్ అయిపోవటంతో, చిన్న బ్రేక్ తీసుకుంటున్నాడు. ఆబ్రేక్ లోనే కిక్ ఇచ్చే నిర్ణయాలు తీసేసుకున్నాడు.
ప్రజెంట్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గాడ్ ఆఫ్ వార్ విషయంలో పనులు మొదలు పెట్టాడు. కార్తీకేయుడి కాన్సెప్ట్ తో ప్లాన్ చేసిన మైథలాజికల్ డ్రామాని, ఎన్టీఆర్ నుంచి సడన్ గా బన్నీ వైపు తీసుకెళ్లి వివాదానికి గేట్లు తీసిన తనే, మొత్తం సమస్యను పరిష్కరించాడు. సారితో సర్వం సాల్వ్ చేశాడు. కట్ చేస్తే, ఎప్పటిలా ఎన్టీఆర్ తో ప్లాన్ చేసిన మైథాలాజికల్ ప్రాజెక్ట్ గాడ్ ఆఫ్ వార్ ప్రీ ప్రొడక్షన్ పనులుమొదలు పెట్టాడు..ముందు తనే కాదు, కొరటాల శివ కూడా మ్యూజిక్ సిట్టింగ్స్ కి రెడీ అవుతున్నారు. ఔను కేవలం త్రివిక్రమ్ కత్తిలాంటి కథ చెప్పాడని, తనకి డేట్లిస్తే, ముందు మోసం చేయబోయాడన్నారు. సరే తర్వాత తప్పును సరిదిద్దుకున్నాడనంటున్నారు… కాకపోతే ఈవిషయంలో రియలైజ్ అయిన ఎన్టీఆర్, త్రివిక్రమ్ కోసం కొరటాల శివని వేయిటింగ్ లిస్ట్ లో పెట్టకూడదనుకున్నాడు.
అందుకే త్రివిక్రమ్ ప్రాజెక్ట్ తో పాటు కొరటాల శివ మేకింగ్ లో చేయాల్సిన దేవర సీక్వెల్ కి కూడా డేట్ల ఇచ్చేశాడు. జూన్ నుంచే ఇటు గాడ్ ఆఫ్ వార్,అటు దేవర 2 రెండూ కూడా షూటింగ్ మొదలుపెట్టొచ్చు… మొత్తానికి దేవర సీక్వెల్ పనులు మొదలటవటం, ఆగిపోవటం, తర్వాత డైలామాలో పడటం.. ఇలాంటి పరిస్తితుల నుంచి క్లియర్ కట్ గా షూటింగ్ కి పర్మీషన్లు వచ్చేశాయి.ఎన్టీఆర్ కూడా గాడ్ ఆఫ్ వార్ ని, అలానే దేవర 2 ని ప్యార్ లల్ గా చేయాలనే ఫిక్స్ అయినట్టున్నాడు. అందుకే వేంగా నిర్ణయాలు తీసుకున్నాడు. దేవర 2 కి జూన్ నుంచే అలానే గాఢ్ ఆఫ్ వార్ కి కూడా జూన్ నుంచే డేట్లిచ్చిన తారక్, 2027 దసరాలోగా ఈ రెండు ప్రాజెక్టులు పూర్తి చేస్తాడట… మొత్తానికి త్రివిక్రమ్ చేసిన తప్పు వల్ల, కొరటాల శివ కిస్మత్ మారిందంటున్నారు. దేవర 2 మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలవుతున్నాయి.. అనిరుద్ కూడా మ్యూజిక్ సిట్టింగ్స్ కి సిద్ధం కావటంతో, ఎన్టీఆర్ కూడా మూడు ప్రాజెక్టులతో బిజీ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది.