మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సైలెంట్ గా తన డ్రాగన్ లాంగ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్నాడు. ఇంతవరకు చిన్న బ్రేక్ లేదు. ఎలాంటి చడీ చప్పుడు లేకుండా, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ని ప్రశాంత్ నీల్ టీం పూర్తి చేసింది. కట్ చేస్తే ఇప్పడు ఎన్టీఆర్ తనలోని కొత్త రూపాన్ని చూపించే టైం వచ్చింది. అంటే తన ప్రస్థుత అవతారం చాలించే టైం వచ్చిందా? తన లుక్ మళ్లీ మారబోతోందా? ఆల్రెడీ సన్నబడి టెన్ ప్యాక్స్ లుక్ తో కనిపిస్తున్నాడన్నారు. కట్ చేస్తే మళ్లీ కాస్త మజిల్స్ పెంచేందుకు నెల టైం తీసుకోబోతున్నాడనంటున్నారు. ఇంతకి తన లుక్ ఎందుకు మళ్లీ మారబోతోంది? కేవలం నెలలో బాడి బిల్డింగ్ తో తన లుక్ ఎంతవరకు మారుతంది? అసలు డ్రాగన్ విషయంలో ప్రశాంత్ నీల్ సైలెంట్ గా ఏం ప్లాన్ చేస్తున్నాడు?
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ డ్రాగన్ గా తన ప్రజెంట్ అవతారం చాలించే టైం వచ్చింది. అంటే తను వేస్తున్న పాత్ర తాలూకు షూటింగ్ వందకు వందశాతం పూర్తైనట్టే… నార్త్ ఈస్ట్ డ్రగ్ మాఫియాకి, ఆఫ్రికా బ్యాక్ డ్రాప్ ని కనెక్ట్ చేసి తీస్తున్న ఈమూవీలో రెండు పాత్రలు వేస్తున్నాడు ఎన్టీఆర్. అందులో ఒకటి తండ్రి పాత్రని ఎప్పిటినుంచో ప్రచారం జరుగుతోంది.దానికోసమే సన్నబడి, టెన్ ప్యాక్స్ లుక్ తో ఆపాత్రతో బిజీ అయ్యాడన్నారు. ఎక్కువ నైట్ షెడ్యూల్స్ లో వర్షపు సీన్లు, ఇంటెన్సిటీ ఉండే ఫ్లాష్ బ్యాక్ సీన్లే తీస్తూ వచ్చింది డ్రాగన్ టీం. అవన్నీ ఎన్టీఆర్ వేస్తున్న రెండు పాత్రల్లో తండ్రి పాత్ర తాలూకు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అని తెలుస్తోంది. మొత్తానికి లాంగ్ షెడ్యూల్స్ ని పూర్తిచేసిన డ్రాగన్ టీం, కొత్త షెడ్యూల్ ప్లానింగ్స్ తో బిజీ అయ్యింది.
కాకపోతే డ్రాగన్ కొత్త షెడ్యూల్ కి కనీసం నెలరోజుల టైం పడుతుందట. కారణం ఈలోపు ఎన్టీఆర్ తన లుక్ మార్చుకోవాలి.. తండ్రి పాత్ర తాలూకు ఫ్లాష్ బ్యాక్ సీన్ ల షూటింగ్ తర్వాత, ఇక సీన్ లోకి కొడుకుపాత్ర రాబోతోంది. ఆ పాత్రకోసమే ఫిల్మ్ టీం సరికొత్త సెట్లు రెడీ చేస్తోంది. ఈలోపు ఎన్టీఆర్ కూడా కాస్త బొద్దుగా మారుతూనే, మజిల్ గేయిన్ వర్కవుట్లు చేయబోతున్నాడట.మరి హెవీగా మజిల్స్ పెంచటం లాంటివి కాకుండా, తన పాత్రకు తగ్గ లుక్ ని నెలరోజుల్లో తెచ్చుకునే పనిలో పడ్డాడు ఎన్టీఆర్. ఈ నెలలోనే దేవర 2, త్రివిక్రమ్ ప్రాజెక్టు తాలూకు ప్రీ ప్రొడక్షణ్ పనులు జరగబోతున్నాయి. వాటిలో కూడా ఎన్టీఆర్ సీరియస్ గా పార్టిసిపేట్ చేయబోతున్నాడట. ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఎన్టీఆర్ కి తన లుక్స్ లో టెంపర్ లుక్ అంటే చాలా ఇష్టమని, మళ్లీ అదే లుక్ ట్రై చేస్తున్నాడని తెలుస్తోంది.
సో టెంపర్ లుక్ లో ఒక పాత్ర బొద్దుగా ఉంటే, సన్నగా మరో పాత్రలో టెన్ ప్యాక్స్ లో తండ్రి కొడుకులుగా ఎన్టీఆర్ డబుల్ డ్రాగన్ డోస్ ఉండబోతోందని తేలింది. కాకపోతే, అదుర్స్ లాంటి మూవీ చూసినా, జైలవకుశనుంచి ఆంధ్రావాలా వరకు ఏది చూసినా హేయిర్ స్టైల్లో మార్పులు తప్ప, హీరో లుక్ లో పెద్దగా మార్పులు లేని కవలల పాత్రలు వేశాడు ఎన్టీఆర్. కాని ఫస్ట్ టైం సన్న ఎన్టీఆర్, కాస్త బొద్దుగా మజిల్స్ తో ఉండే ఎన్టీఆర్ లుక్స్ తో ఒకేసారి రెండు డ్రాగన్ల ఎఫెక్ట్ ఇవ్వబోతున్నాడు.