రెబల్ స్టార్ ప్రభాస్ స్పిరిట్ షూటింగ్ కి బ్రేక్ ఇచ్చాడు. ఇప్పుడు మళ్లీ ఫౌజీ షూటింగ్ తో బిజీ కాబోతున్నాడు. ఐతే ఇప్పుడు తన ఫోకస్ అంతా ఈ రెండు సినిమాల మీదే ఉంది. దీపావళి పండక్కి సాలిడ్ ఎటాక్ ని ఫౌజీ టీం కన్ఫామ్ చేస్తోంది. అంటే దీపావళికి థౌజెండ్ వాలగా ఫౌజీ పేలటం ఖాయమైంది. ఆతర్వాతే ఉగాదికి స్పిరిట్ టెన్ థౌజెండ్ వాలాగా మారేలా ఉంది. ఇందులో ఎలాంటి మార్పు ఉండేలా లేదు. నిజానికి మార్చ్ 25 కి సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమా వారణాసి రాబోతోందని ఫిల్మ్ టీం తేల్చింది. కాని రెబల్ స్టార్ మూవీ స్పిరిట్ కోసం ఇప్పుడు రాజమౌలి టీం వారణాసిని నెలరోజులు వాయిదా వేసేలా ఉంది. ఇంతకి కలిసొచ్చే దసరా, దానికి ముందు వినాయక చవితి, ఇన్ని ఉన్నా ఫౌజీని ఎందుకని దీపావళికే రిలీజ్ చేస్తున్నారు… షూటింగ్ పూర్తికాలేదనా అంటే, మార్చ్ కల్లా ఫౌజీ పూర్తవ్వొచ్చు కాబట్టి, అది సమస్యే కాదు… దీనికి తోడు వారణాసి విడుదల ప్లాన్ చేసుకున్న ఉగాదినే ఎందుకు స్పిరిట్ టీం టార్గెట్ చేసింది.. ఆ రిలీజ్ డేట్లే ఎందుకు అంతా స్పెషల్?
రెబల్ స్టార్ ప్రభాస్ తో హను రాఘవపూడీ తీస్తున్నమూవీ ఫౌజీ. మధ్యలో ఆగింది… ఇప్పుడు మొదలు కాబోతోంది. అక్టోబర్ కల్లా సినిమా రిలీజ్ అవ్వాలి… అదే టార్గెట్ తో పెండింగ్ షూటింగ్ కి షెడ్యూల్స్ ప్లాన్ చేసింది ఫిల్మ్ టీం. ఒక వైపు సందీప్ రెడ్డి మేకింగ్ లో స్పిరిట్ చేస్తూనే, మరో వైపు ఫౌజీ లుక్ కి ప్రభాస్ ఎలా మారిపోతాడన్న డౌట్లకి ఆన్సర్ లేదు.కాని ఒక్క విషయం మాత్రం తేలింది. అదే రెండు పండగలను ప్రభాస్ రెండు పాన్ వరల్డ్ మూవీలు టార్గెట్ చేశాయని. ఒకటి ఫౌజీ, రెండు స్పిరిట్.. ముందుగా ఫౌజీ సినిమా ఈ ఏడాది సమ్మర్ లో రావాలి.. కాని జూన్ కి మార్చారన్నారు. ఇక స్పిరిట్ మూవీ వస్తే దసరా, లేదంటే దీపావలికి , మరీ కాదంటే క్రిస్మస్ కి అనుకున్నారు.కాని లెక్కలు మారాయి…
వాయిదాలు పడ్డా, పర్ఫెక్ట్ టైమింగ్ తోనే ఫౌజీ, స్పిరిట్ మూవీలు రాబోతున్నాయి… ఫౌజీ దీపావలికి థౌజెండ్ వాలాగా రాబోతోంది. ఇక వచ్చే ఏడాది ఉగాదికి అంటే ఏప్రిల్ మొదటి వారంలో స్పిరిట్ రిలీజ్ డేట్ ఫైనలైంది. నిజానికి ఆ సీజన్ లో రావాల్సింది రాజమౌళి మూవీ. కాని వారణాసి సినిమాను మార్చ్ 25 నుంచి మే చివరికి మార్చేస్తున్నారని తెలుస్తోంది..అదే జరిగితే, రెబల్ స్టార్ ప్రభాస్ మూవీ స్పిరిట్ కి కనీసం రెండు మూడు నెలల వరకు పోటీలేనట్టే… కాబట్టి ఫౌజీ దీపావలికి థౌజెండ్ వాలాగా పేలితే… స్పిరిట్ త్రీథౌజెండ్ వాలాగా ఉగాదిని ఊపేస్తుందనే లెక్కలు వినిపిస్తున్నాయి. ఎంతైనా సందీప్ మేకింగ్ లో ప్రభాస్ మూవీ అంటే, అది బాహుబలి లా ట్రెండ్ సెట్టర్ అవుతుందనే అంచనాలున్నాయి.
మిగతా కాంబినేషన్ కి ఈ ఇద్దరి కాంబోలో స్పిరిట కి చాలా వ్యత్యాసం ఉంది. రణ్ బీర్ కపూర్ లాంటి స్టార్ నే యానిమల్ గా చూపించి 900 కోట్లు సందీప్ రాబడితే, పాన్ ఇండియా కింగ్ ప్రభాస్ ని ఇంకెంత రగ్గుడుగా చూపిస్తాడు… అన్న అంచనాలు ఈ సినిమా స్థాయిని 2000 కోట్లు కాదు, 3 వేల నుంచి 5 వేల కోట్ల సినిమాగామార్చే ఛాన్స్ఉంది. అలాంటి టైంలో పోటీ ఇవ్వాల్సిన వారణాసి కూడా రెండు నెలలు వెనక్కి తగ్గాల్సి వస్తోందన్న మాట, నిజంగా స్పిరిట్ నెత్తిన పాలు పోసినట్టౌతోంది.