మణిరత్నం… రజనీ కాంత్ ను మెంటల్ టార్చర్ చేసారా…?

కొంతమంది దర్శకులు నటన విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ అవ్వరు. తాము రాసుకున్న సీన్ తాము అనుకున్నట్టు వచ్చే వరకు నటులను వదిలే ఛాన్స్ ఉండదు. అగ్ర హీరోలు అయినా సరే వాళ్ళు వదలరు. అగ్ర దర్శకులు అయితే ఈ విషయంలో మరింత పట్టుదలగా ఉంటారు. క్రియేటివ్, నటనకు ప్రాధాన్యత ఇచ్చే వారిని సంతృప్తి పరచడం అంత సులువు ఏం కాదు. అలాంటి దర్శకుల్లో మణిరత్నం ఒకరు. తాను ఒక సీన్ డిజైన్ చేసుకుంటే అది అలా […]

Post Published By: Vencateshg
Updated : 22 August 2024, 8:12 PM IST

కొంతమంది దర్శకులు నటన విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ అవ్వరు. తాము రాసుకున్న సీన్ తాము అనుకున్నట్టు వచ్చే వరకు నటులను వదిలే ఛాన్స్ ఉండదు. అగ్ర హీరోలు అయినా సరే వాళ్ళు వదలరు. అగ్ర దర్శకులు అయితే ఈ విషయంలో మరింత పట్టుదలగా ఉంటారు. క్రియేటివ్, నటనకు ప్రాధాన్యత ఇచ్చే వారిని సంతృప్తి పరచడం అంత సులువు ఏం కాదు. అలాంటి దర్శకుల్లో మణిరత్నం ఒకరు. తాను ఒక సీన్ డిజైన్ చేసుకుంటే అది అలా వస్తే మాత్రమే ఆయన సాటిస్ఫై అయ్యేవారు.

ఈ విషయంలో సూపర్ స్టార్ రజనీ కాంత్ కు ఒక చేదు అనుభవం ఉంది. రజనీ కాంత్ లాంటి నటుడుకి కూడా ఆయన చుక్కలు చూపించారు. ఒక్క సీన్ కోసం ఎన్నో టేక్ లు చేసినా సరే మణిరత్నం ఓకే అనలేదట. ఈ విషయాన్ని రజనీ కాంత్ స్వయంగా బయటపెట్టారు. 1991 లో విడుదలైన దళపతి సినిమా ఏ రేంజ్ లో హిట్ అయిందో అందరికి తెలిసిందే. ఆ సినిమాలో ఒక సీన్ ను మణిరత్నం చాలా పట్టుబట్టి చేయించారట. దీనిపై రజనీ మాట్లాడుతూ దళపతిలో రాజకీయ నాయకుడితో నేను సవాల్ చేసే సన్నివేశం ఒకటి ఉంది.

ఆ సీన్ కోసం చాలా కష్టపడ్డాను. అది బాగా రావాల్సిందే అని మణిరత్నం ఎంతో పట్టుబట్టి చేయించారు నాతో అని గుర్తు చేసుకున్నారు. లెక్కలేనన్ని టేక్స్ తీసిన తర్వాత కూడా సరిగా నటించాలేదని అసహనం వ్యక్తం చేసారట. ఆ వెంటనే ఏం చేయాలో తెలియక తన ఫ్రెండ్ కమల్ హాసన్ కు ఫోన్ చేశా అని రజనీ గుర్తు చేసుకున్నారు. అప్పుడు... కమల్ మాట్లాడుతూ ఇలాంటిది జరుగుతుందని తనకు ముందే తెలుసు అని... ఆ సీన్ లో మణిరత్నం ను నటించి చూపించి ఆ తర్వాత నువ్వు చేయి అని సలహా ఇచ్చారట కమల్ హాసన్. ఆ తర్వాత ఆ షాట్ చాలా బాగా వచ్చిందని... ఆ విషయంలో కమల్ హాసన్ కు రుణపడి ఉంటా అంటూ అప్పటి రోజుల గుర్తు చేసుకున్నారు.

Published : 
  • 22 August 2024, 8:12 PM IST