Pooja Hegde: సల్మాన్‌తో ఎఫైర్ పూజా కలా? ఇదెక్కడి దిక్కుమాలిన డ్రీమ్!

బాలీవు్డ్‌లో బాగా రాణించడానికి వివాదాలు, లేదంటే ఎఫైర్లే ఉపయోగపడతాయి. అక్కడ ట్యాలెంట్ కంటే ఎఫైర్లతో పైకొచ్చిన వాళ్లే ఎక్కువ. సల్మాన్ గాల్ ఫ్రెండ్‌గా ఒక్కసారి బయటికి పుకారు వస్తే, బాలీవుడ్‌లో ఆ హీరోయిన్‌కి ఇచ్చే గౌరవమే వేరు.

Post Published By: narender Thiru
Updated : 14 April 2023, 5:28 PM IST

Pooja Hegde: బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్‌తో ఎఫైర్ అనేది పూజా హెగ్డే డ్రీమా? ఇలాంటి కల ఎవరికుంటుందనే డౌట్లు రావటం సహజం. దీనికో కారణం ఉంది. మొదట్లో బాలీవుడ్ పూజా హెగ్డేని దగ్గరికి తీసుకుని, తర్వాత పక్కకు పెట్టేసింది. కాని సౌత్‌లో తను స్టార్ హీరోయిన్ కాగానే సల్మాన్ నుంచి రణ్ వీర్ సింగ్ వరకు అంతా తనే కావాలంటున్నారు. ఇలా టైం కలిసొస్తున్నప్పుడు పూజా ఎందుకు సల్మాన్‌తో ఎఫైర్ అనగానే ఫైర్ కాకుండా సిగ్గుపడుతోంది? అక్కడే కథలో పెద్ద ట్విస్ట్ ఉంది.

బేసిగ్గా బాలీవుడ్‌లో బాగా రాణించడానికి వివాదాలు, లేదంటే ఎఫైర్లే ఉపయోగపడతాయి. అక్కడ ట్యాలెంట్ కంటే ఎఫైర్లతో పైకొచ్చిన వాళ్లే ఎక్కువ. సల్మాన్ గాల్ ఫ్రెండ్‌గా ఒక్కసారి బయటికి పుకారు వస్తే, బాలీవుడ్‌లో ఆ హీరోయిన్‌కి ఇచ్చే గౌరవమే వేరు. అందుకే సల్మాన్ గాల్ ఫ్రెండ్ అనిపించుకోవటానికి చాలా మంది హీరోయిన్లు తెగ ఆరాట పడతారు.. ఐతే ప్రస్తుతం సల్మాన్ 57 ఏళ్లు దాటి, త్వరలో సీనియర్ సిటిజన్ లిస్ట్‌లోకివెళ్లబోతున్నాడు. అంతేకాదు తన ప్రేమ, గాల్ ఫ్రెండ్ లాంటి అంశాలను ఒకప్పటిలా మీడియా ఇప్పుడు పట్టించుకోవట్లేదు.

అలాంటి అంకుల్‌తో ఎఫైర్ కోసం పూజా హెగ్డే ఆరాటపడటం ఫూలిష్ అనే కామెంట్ల దాడి కూడా పెరిగింది. పైగా సల్మాన్‍తో ఎఫైర్ లేదు.. తాను సింగిల్ అని పూజా అంటున్నా.. లోపల మాత్రం సల్మాన్‌తో క్లోజ్‌గా ఉంటున్న హీరోయిన్ అంటే మాత్రం పూజా తెగ మురిసిపోతున్నట్లు కనిపిస్తోంది.

 

Published : 
  • 14 April 2023, 5:28 PM IST