Keerthy Suresh: ముద్దంటే చేదంటూనే.. మొదటి సారి ముద్దుల వర్షం

తమన్నా, కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే, రష్మిక.. ఇలా వీళ్లంతా సౌత్‌లో ముద్దుగా కనిపించి, బాలీవుడ్ ఆఫర్ రాగానే డ్రెస్‌ని చాలా పొదుపుగా వాడారు. ముద్దుల విషయంలో హద్దులు దాటారు. అదే విషయంలో ఇప్పుడు కీర్తి సురేష్ ఒక అడుగుముందుకేసేలా ఉంది.

Post Published By: narender Thiru
Updated : 20 February 2024, 7:49 PM IST

Keerthy Suresh: టాలీవుడ్, కోలీవుడ్, మల్లూవుడ్, శాండిల్ వుడ్.. ఇలా సౌత్ ఇండస్ట్రీ ఏదైనా, హీరోయిన్ ఎవరైనా ముంబై ఎక్స్ ప్రెస్ ఎక్కితే చాలు, వాళ్ల డ్రెస్ విషయంలో పొదుపుగా మారిపోతారు. గ్లామర్ డోస్ పెంచేస్తారు. ఆల్రెడీ తమన్నా, కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే, రష్మిక.. ఇలా వీళ్లంతా సౌత్‌లో ముద్దుగా కనిపించి, బాలీవుడ్ ఆఫర్ రాగానే డ్రెస్‌ని చాలా పొదుపుగా వాడారు. ముద్దుల విషయంలో హద్దులు దాటారు.

Operation Valentine: ఆపరేషన్ వాలెంటైన్ మూవీతో బాలీవుడ్‌కి తలనొప్పి..?

అదే విషయంలో ఇప్పుడు కీర్తి సురేష్ ఒక అడుగుముందుకేసేలా ఉంది. సౌత్‌లో ఎన్నడూ ముద్దంటే చేదనే మాట మీదే ఉన్న తను, హిందీలో సినిమా చేసే సరికి, ఫ్రెంచ్ కిస్‌తో షాక్ ఇచ్చేలా ఉందట. వరుణ్ ధావన్ నటిస్తున్న బేబీ జాన్ మూవీలో కీర్తి సురేష్ ముద్దులతో ముంచేస్తోందట. బికీనీస్‌లో గ్లామర్ డోస్ పెంచి బోల్డ్ సీన్స్‌లో క్లీన్ బోల్డ్ చేసేలా ఉందట. ఇది మలయాళం మీడియలో హాట్ టాపిక్‌గా మారింది. ఆఫర్లు తగ్గినా, ఏజ్ బార్ స్టేజ్ వచ్చినా గ్లామర్ డోస్ పెంచటమో, ఇలాంటి సెన్సేషన్ ఏదో చేయటమో హీరోయిన్లకు తప్పదంటారు.

లస్ట్ స్టోరీస్ సీక్వెల్‌లో తమన్నా ఇలానే హద్దులు దాటేసింది. టిల్లూ స్క్వేర్‌లో కూడా అనుపమా పరమేశ్వరన్ ఇలానే యూత్ మతిపోగొట్టేలా ముద్దుల వర్షం కురిపించింది. మరి కీర్తి సురేష్ కూడా ప్రచారం జరుగుతున్నట్లుగానే లిప్ లాక్ సీన్స్ చేస్తుందా.. లేదా.. అన్నది చూడాలి.

Published : 
  • 20 February 2024, 7:49 PM IST