వివాదం నడుస్తున్న వేళ వీడియో రిలీజ్ చేసిన రాజమౌళి.. ఇంతకీ ఏమన్నాడో తెలుసా..?

ఎప్పుడు సినిమాలతో ట్రెండింగ్ అయ్యే రాజమౌళి ఇప్పుడు వివాదంతో ట్రెండ్ అవుతున్నాడు. నేను రాజమౌళి స్నేహితుడిని.. 34 సంవత్సరాలుగా మా మధ్య స్నేహం ఉంది..

  • Written By:
  • Publish Date - March 3, 2025 / 04:00 PM IST

ఎప్పుడు సినిమాలతో ట్రెండింగ్ అయ్యే రాజమౌళి ఇప్పుడు వివాదంతో ట్రెండ్ అవుతున్నాడు. నేను రాజమౌళి స్నేహితుడిని.. 34 సంవత్సరాలుగా మా మధ్య స్నేహం ఉంది.. నన్ను రాజమౌళి టార్చర్ చేస్తున్నాడు అంటూ శ్రీనివాసరావు అనే వ్యక్తి విడుదల చేసిన ఒక వీడియో సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసింది.

అందులో నిజం అబద్ధం ఎంత ఉందో పక్కన పెట్టేసి ముందు వైరల్ అయితే చేసేసారు. తాను, రాజమౌళి ఒకే అమ్మాయిని ప్రేమించామని.. ఆ విషయం బయట పడుతుందని తనపై ఒత్తిడి తెస్తున్నారని.. కొన్ని సంవత్సరాలుగా టార్చర్ చేస్తున్నాడని ఆరోపిస్తూ ఒక వీడియో విడుదల చేశాడు.కానీ ఇండస్ట్రీ వర్గాల కథనం ప్రకారం.. అతను రాజమౌళి స్నేహితుడే అయినా.. ఆయన చెబుతున్న మాటల్లో నిజం ఉందో లేదో తెలియదు అంటున్నారు.ఈ వివాదంపై రాజమౌళి కచ్చితంగా స్పందిస్తాడు అని అందరూ అంటున్నారు.. అనుకున్నట్టుగానే వీడియో రిలీజ్ చేశాడు కానీ వివాదం మీద కాదు వేరే విషయం మీద.

తన పెద్దన్న ఎంఎం కీరవాణి లైవ్ కన్సర్ట్ గురించి చెబుతూ ఒక వీడియో విడుదల చేశాడు దర్శక ధీరుడు. మార్చి 22న జరిగబోయే ఈ లైవ్ ఈవెంట్‌లో కీరవాణి తన సినీ సంగీత ప్రయాణాన్ని శ్రోతల ముందుకు తీసుకొస్తున్నట్లు వీడియోలో తెలిపాడు రాజమౌళి. ఈ కార్యక్రమంలో తన సినిమా పాటలతో పాటు, ఆయన కంపోజ్ చేసిన వేలాది పాటలను ప్రదర్శించనున్నారు. అంతేకాక ఈ లైవ్ కన్సర్ట్‌లో తాను కూడా పాల్గొంటున్నట్టు తెలిపాడు జక్కన్న. మొత్తానికి వివాదం మీద కాకుండా చాలా తెలివిగా మరో విషయం మీద వీడియో రిలీజ్ చేసి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాడు రాజమౌళి.