రౌడీ ఈజ్ బ్యాక్.. 2026లో విజయ్ దేవరకొండ బాక్సాఫీస్ ఊచకోత షురూ.. ఇటు రణబాలి.. అటు రౌడీ..!

విజయ్ దేవరకొండ.. ఈ పేరు వింటేనే ఒక వైబ్రేషన్. టాలీవుడ్‌లో తనకంటూ ఒక సెపరేట్ బ్రాండ్ క్రియేట్ చేసుకున్న రౌడీ స్టార్.. కొంతకాలం సైలెంట్‌గా ఉన్నా ఇప్పుడు మాత్రం గట్టిగా కొట్టేందుకు సిద్ధమయ్యాడు.

  • Written By:
  • Updated On - January 27, 2026 / 05:17 PM IST

విజయ్ దేవరకొండ.. ఈ పేరు వింటేనే ఒక వైబ్రేషన్. టాలీవుడ్‌లో తనకంటూ ఒక సెపరేట్ బ్రాండ్ క్రియేట్ చేసుకున్న రౌడీ స్టార్.. కొంతకాలం సైలెంట్‌గా ఉన్నా ఇప్పుడు మాత్రం గట్టిగా కొట్టేందుకు సిద్ధమయ్యాడు. నో బ్రేక్స్, నో ఫియర్ అన్నట్టుగా 2026 ఏడాదిని తన ఖాతాలో వేసుకోవడానికి విజయ్ కంకణం కట్టుకున్నాడు. బ్యాక్ టు బ్యాక్ పవర్ ప్యాక్డ్ సినిమాలతో థియేటర్లలో రచ్చ లేపేందుకు పక్కా ప్లాన్‌తో వస్తున్నాడు. ఈసారి కేవలం నటన మాత్రమే కాదు.. బాక్సాఫీస్ రికార్డులను కూడా తిరగరాయడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. సెప్టెంబర్ 11న విడుదల కానున్న రణబాలి చిత్రంపై అప్పుడే భారీ అంచనాలు నెలకొన్నాయి. రాయలసీమ గడ్డపై జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ మూవీలో విజయ్ లుక్ అల్ట్రా మాస్ లెవల్లో ఉండబోతోంది.

రగ్గడ్ బ్యాక్‌డ్రాప్, రా అండ్ రస్టిక్ యాక్షన్ సీక్వెన్స్‌లతో సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. గతేడాది సాఫ్ట్ రోల్స్‌లో కనిపించిన రౌడీ.. ఈసారి సీమ యాసలో డైలాగులు పేలుస్తుంటే థియేటర్లు దద్దరిల్లడం గ్యారెంటీ. ఇక డిసెంబర్‌లో రాబోతున్న రౌడీ జనార్ధన విజయ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ మాస్ ఎంటర్‌టైనర్ కానుంది. గోదావరి యాసలో విజయ్ చెప్పే డైలాగులు, ఆ బాడీ లాంగ్వేజ్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించేలా ప్లాన్ చేశారు. ఒక పక్క రాయలసీమ పౌరుషం, మరోపక్క గోదావరి మాస్ మ్యానరిజమ్స్.. ఇలా రెండు విభిన్నమైన పాత్రలతో విజయ్ తన వర్సటాలిటీని నిరూపించుకోబోతున్నాడు. ఈ రెండు సినిమాలు కేవలం కమర్షియల్ హిట్స్ మాత్రమే కాదు.. విజయ్ దేవరకొండ అనే బ్రాండ్‌ను మళ్ళీ పీక్స్‌కి తీసుకెళ్తాయని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

సక్సెస్, ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా తన మేకోవర్‌తో ఎప్పుడూ ప్రయోగాలు చేసే విజయ్.. ఈసారి తన రూట్ మార్చాడు. ఫ్యాన్స్ కోరుకునే కంప్లీట్ మాస్ ఎలిమెంట్స్‌పై ఫోకస్ పెట్టారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టర్లు చూస్తుంటే, పాత విజయ్‌ను మించిన ఎనర్జీతో ఆయన రీఎంట్రీ ఇస్తున్నారని అర్థమవుతోంది. డెలివరీలో ఎంత వేగం ఉన్నా, కంటెంట్ విషయంలో మాత్రం ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ ప్రాజెక్టులను పట్టాలెక్కించాడు. మొత్తానికి 2026 విజయ్ దేవరకొండ నామ సంవత్సరంగా మారబోతోంది. సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు బాక్సాఫీస్ వద్ద రౌడీ మేనియా కొనసాగనుంది. ఒకప్పుడు అర్జున్ రెడ్డితో ఎలాగైతే ట్రెండ్ సెట్ చేశాడో.. ఇప్పుడు రణబాలి, రౌడీ జనార్ధన చిత్రాలతో మళ్ళీ అదే మేజిక్ రిపీట్ చేయడానికి సిద్ధమయ్యాడు. గెట్ రెడీ ఫర్ ది రైజ్ ఆఫ్ ది రౌడీ.. ఈసారి సినిమా మామూలుగా ఉండదు మాస్ జాతరే అంటున్నారు ఫ్యాన్స్.

https://www.instagram.com/thedeverakonda/p/DT-rPO7gYXo/?hl=en