మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కెరీర్ ఇంకా ఏడేళ్లే కొనసాగుతుందా? వింటానికి ఆశ్చర్యంగా ఉన్నా ఎన్టీఆర్ ఇంకా ఐదారు సినిమాలకు మించి నటించే ఛాన్సెస్ కనిపించట్లేదు. ఎందుకంటే తన డెడ్ లైన్ దగ్గర పడుతోంది. 50ఏళ్లు నిండటానికి 7 ఏళ్లే టైముంది… ఇంతకి 50 ఏళ్ల డెడ్ లైన్ ఏంటి? అప్పటి వరకు సినిమాలు చేసి, తర్వాతేందుకు తను గుడ్ బై చెప్పాలి..? అక్కడే ఆన్సర్ పొలిటికల్ గా రీసౌండ్ చేస్తోంది.. తనకి రాజకీయ ఆసక్తులు లేవన్నాడు… సినిమాలతోనే తన జర్నీ అన్నాడు.. కాని ఏడేళ్ల తర్వాత పూర్తిగా తను సినిమాలకు దూరం అవ్వాల్సిందేనా? అలాంటి స్ట్రాంగ్ నిర్ణయం తీసుకున్నాడా? ఇవన్నీ గాలి వార్తలుగా మిగిలిపోతాయా? పరిస్థితి చూస్తుంటే, కాదనిపించేలానే ఉంది.. కాని ఎగ్జాక్ట్ గా ఏడేళ్ల నియమమేంటి? దానిక వెనకేమైనా లాజిక్ ఉందా? అంటే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఫ్యాన్స్ కి ఏడేళ్ల తర్వాత సినిమాల పరంగా నిరాశ తప్పదా? ఇంతకి తన ఆఖరి ఐదు సినిమాలేంటి?
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ డ్రాగన్ గా బిజీ అయ్యాడు. మే నుంచి దేవర సీక్వెల్ మొదలు కాబోతోంది. జూన్ నుంచి త్రివిక్రమ్ మేకింగ్ లో మైథాలజీ మూవీ గాడ్ ఆఫ్ వార్ మొదలౌతుంది. ఆతర్వాత నెల్సన్ దిలిప్ సినిమా, ఆతర్వాతే సందీప్ రెడ్డి వంగ మూవీ షురూ అవుతుంది. సో ఈ ఐదు సినిమాలే ఎన్టీఆర్ కెరీర్ లో చివరి ఐదు మూవీలా? ఆతర్వాత రాజమౌళితో ప్రాజెక్ట్ ఉంటుందనే ప్రచారం అయితే ఉంది.. కాని అప్పటికే ఎన్టీఆర్ కి 50ఏళ్ల వయసు వస్తుంది..అంటే 50ఏళ్లు నిండితే ఎన్టీఆర్ సినిమాలు చేయకూడదా? మూవీలనుంచి రిటైర్ అవ్వాలా? ఈ డౌట్లవసరం లేదు..ఎందుకంటే కనీసం 50 ఏళ్ల వయసు నిండే వరకు ఎన్టీఆర్ మరో వైపు చూడకూడదనుకున్నాడని ఎప్పటి నుంచో ప్రచారం ఉంది. అంటే 50 ఏళ్లు నిండాక రాజాకీయాల్లోకి వస్తాడా? ఎలాంటి డౌట్లు అక్కర్లేదు… మరీ 60 ఏళ్లు నిండి షష్టిపూర్తయ్యాక సినిమాల్లోకి రావటం కంటే, 50 నిండాకే పొలిటికల్ఎంట్రీ ఇవ్వాలనేది ఎన్టీఆర్ నిర్ణయం అంటున్నారు..
తన ఐదేళ్ల కెరీర్ ని ఐదేళ్ల ముందే డిజైన్ చేసుకునే విశ్వముదురు ఎన్టీఆర్. అందుకే 43 ఏళ్లు నిండిన తను, ఏడేళ్ల తర్వాత పొలిటికల్ గా ఎంట్రీ ఇచ్చేందుకు కూడా మెంటల్ గా ప్రిపేర్ అవుతున్నాడట. అదే సరైన టైం, అప్పుడు తను ఎంట్ర ఇస్తేనే అన్నీ రకాలుగా అనుకూలంగా ఉంటుందనే అంచనాలున్నాయి. నిజానికి రాజకీయాలు ఇంట్రస్ట్ లేవు.. సినిమాలే తన జీవితం అన్నాడు ఎన్టీఆర్..కాని తెలుగు దేశం పార్టీకి ఇప్పుుడు కంటే 7 ఏల్ల తర్వాతే తాతకి తగ్గ మనవడిగా ఎన్టీఆర్ అవసరం ఉంటుందనే ఒక విశ్లేషన ఉంది. ఉదాహరణకి, చిరు, పవన్ కల్యాన్, పక్కరాష్ట్రం హీరో విజయ్ దలపతి.. ఎవరినిచూసుకున్నా, 50 నుంచి 55 ఏళ్ల వయసులోనే అంతా పొలిటికల్ గా ఎంట్రీ ఇచ్చారు. ఒంట్లో ఓపిక లేని టైంలో పాదయాత్రలు, పొలిటికల్ ఎంట్రీలు ఫలితాన్నివ్వలేవు..
అలా చూసినా 50 ఏళ్ల వయసులోనే ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీకి ఛాన్స్ఉంది. తమిళ స్టార్ విజయ్ కూడా ఎన్నోసార్లు పొలిటికల్ ఎంట్రీ గురించి అడిగితే, నో చెప్పాడు. అసలా ఇంట్రస్టే లేదన్నాడు. కాని గ్రౌండ్ వర్క్ మాత్రం ఫ్యాన్స్ తో చేయించాడు. సైలెంట్ గా ఆల్ ఆఫ్ సడన్ గా పార్టీ పెట్టి, జనాల్లోకి వెళ్లాడు. ఎన్టీఆర్ ది కూడా అదే స్ట్రాటీజీ అనంటున్నారు. ఐతే చిరు రాజకీయాల్లోకి రాగానే సినిమాలకు బ్రేక్ వేశాడు. పవన్ అలానే చేసి, యూటర్న్ తీసుకున్నాడు. తమిళ నాట విజయ్ కూడా అదే పని చేస్తున్నాడు. అందుకే ఏం చేసినా ఈ ఏడేళ్లలోనే చేసేందుకు ఎన్టీఆర్ ఫిక్స్ అయినట్టున్నాడు.కాకపోతే ఇప్పుడున్న ఐదు సినిమాలు చేసే సరికే ఏడేళ్లు గడిచిపోయేలా ఉన్నాయి… ఆలెక్కన రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్టులో తను ఉండడా అంటే, మహాభారతంలో తనకోసం ఒక పాత్ర ఎప్పుడూ సిద్దంగానే ఉంటుందనేది రాజమౌళి నుంచి వచ్చే భరోసా.. సో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినా, తాతలానే కొద్దిగా రాజమౌళి ప్రాజెక్ట్ తో సినిమాకు టచ్ లో ఉంటూ రాజకీయ జర్నీ చేసే ఛాన్స్ఉంది. ఇప్పుడీ డిస్కర్షన్ రావటానికి కూడా ఓరకంగా దేవర 2 మూవీ టీం ప్లానింగే… ఆ టీం నుంచి వచ్చిన ఫీలర్స్ వల్లే, ఆఫ్టర్ 50 ఎన్టీఆర్ సినిమాలకు బ్రేక్ వేస్తాడనే చర్చ మొదలైంది.