బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసిన అనంతరం సోమవారం సాయంత్రం ఆమె భారత్ కు చేరుకున్న సంగతి తెలిసిందే. ఆమె లండన్ వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నా అక్కడి ప్రభుత్వం నుంచి ఇంకా స్పందన రావడం లేదు. ఒకవేళ బ్రిటన్ అంగీకరించకపోతే భారత్ లోనే ఆశ్రయం పొందాలని ఆమె భావిస్తోంది. అయితే కేంద్రం ఆమెను భారత్ లో ఉండేందుకు తాత్కాలికంగానే అనుమతించింది. ప్రస్తుతం ఆమె ఢిల్లీకి సమీపంలో ఒక ఎయిర్ బేస్ లో ఆశ్రయం పొందుతున్నారు. […]
