ఆస్ట్రేలియా టూర్ లో భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బూమ్రా తన సూపర్ ఫామ్ కొనసాగిస్తున్నాడు. సహచర బౌలర్ల నుంచి సరైన సపోర్ట్ లేకున్నా… తాను ఒక్కడే తనదైన పేస్ తో ప్రత్యర్థి జట్టును కంగారుపెడుతున్నాడు. తొలి రెండు టెస్టుల్లో అదరగొట్టిన బుమ్రా ఇప్పుడు గబ్బాలోనూ సత్తా చాటాడు.
