చాహల్ @ 100 వికెట్లు కౌంటీల్లో అరుదైన ఘనత

భారత్ యువస్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ కౌంటీల్లో అదరగొడుతున్నాడు. ఇంగ్లీష్ గడ్డపై తన స్పిన్ మ్యాజిక్ చూపిస్తున్నాడు. జాతీయ జట్టుకు దూరమైన చాహల్ ప్రస్తుతం కౌంటీల్లో నార్తాంప్టన్ షైర్ కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.

Post Published By: Vencateshg
Updated : 11 September 2024, 6:55 PM IST

భారత్ యువస్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ కౌంటీల్లో అదరగొడుతున్నాడు. ఇంగ్లీష్ గడ్డపై తన స్పిన్ మ్యాజిక్ చూపిస్తున్నాడు. జాతీయ జట్టుకు దూరమైన చాహల్ ప్రస్తుతం కౌంటీల్లో నార్తాంప్టన్ షైర్ కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. డెర్బీషైర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చహల్‌ ఐదు వికెట్ల ప్రదర్శనతో మెరిశాడు. ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో చహల్‌ ఈ ఫీట్‌ను సాధించాడు. దీంతో కౌంటీ క్రికెట్ లో వంద వికెట్లు మైలురాయి పూర్తిచేసుకున్న భారత బౌలర్ గా రికార్డ్ సృష్టించాడు. చహల్‌ గత నెలలో ఇంగ్లండ్‌ వన్డే కప్‌లోనూ ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. నార్తంప్టన్‌షైర్‌ తరఫున తన తొలి మ్యాచ్‌లో కెంట్‌పై ఈ ఫీట్‌ను సాధించాడు. ఆ మ్యాచ్‌లో చహల్‌ తన కోటా 10 ఓవర్లలో ఐదు మెయిడిన్లు వేసి కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చాడు.

Published : 
  • 11 September 2024, 6:55 PM IST